Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 రోజుల్లో 52 నమోదు
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలో క్రమక్రమంగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 2 నుండి 14 వరకు 578 మదికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 52 పాజిటీవ్లు నమోదయ్యాయి. ప్రధానంగా కోర్టు ఏరియా, ఆర్ఆర్ కాలని, ఎల్బిఎస్ నగర్, 14నెంబర్ బస్తీలో తొలుత కేసులు నమోదయ్యాయి. అనంతరం క్రమక్రమంగా కాకతీయనగర్, నెం.2బస్తీ, ఇందిరానగర్, లలిత్కళామందిర్ ఏరియా, ఎన్జిఓ కాలనీ, జెకే ఏరియా, ఆంబజార్, ఇల్లందులపాడు, సుందరయ్యనగర్, సీఎస్పీ బస్తీ, 24 ఏరియా, రొంపేడు, కొమరారంలో విస్తరిస్తున్నాయి. గత 13 రోజులుగా 2, 4 కేసులు నమోదు కాగా బుధవారం ఒక్కరోజే పట్టణంలో 9 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ సందర్బంగా ప్రభుత్వ వైద్యులు వరుణ్ కుమార్ మాట్లాడుతూ వైరస్ వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రజలు విధిగా మాస్క్లు ధరించాలన్నారు.