Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుమ్ముగూడెం : అంబేద్కర్ జయంతి వేడుకలను సీపీఐ (ఎం), సీపీఐ, న్యూ డెమోక్రసీ, ఏఎస్పి, బీఎస్పీ, టీడీపీ పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహి ంచారు. ములక పాడు అంబేద్కర్ విగ్రహం వద్ద నాయ కులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. మండల కార్యాలయాల్లో వేడుక లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజ న సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారం పుల్లయ్య, వ్యకా స మండల కార్యదర్శి యలమంచి వంశీకృష్ణ, సీఐ టీj ుూ మండల కన్వీనర్ కోర్స చిలకమ్మ, శ్రామిక మహి ళా జిల్లా కార్యదర్శి జి.పద్మ, లక్ష్మీ నగరం సర్పంచ్ రాజ మ్మ, రైతు సంఘం మండల అధ్యక్షులు శ్రీను బాబు, సీపీఐ, ఎన్డీ, ఏఎస్పి, టీడీపీ, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.
నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మండలం లోని లక్ష్మీనగరం, అచ్యుతాపురం, గంగోలు, సీతరం పురం, దుమ్ముగూడెం, ములకపాడు, బైరాగులపాడు, సున్నంబట్టి గ్రామాలలో గల సుమారు 200 మంది నిరుపేద కుటుంబాలకు భోజన పాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, సంఘ సేవకులు, దాతలు యువ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం పార్టీ కా ర్యాయ ంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ వర్కి ంగ్ ప్రెసిడెంట్ భీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పిరినాకి నవీన్, మండ ల కాంగ్రెస్ కార్యదర్శి గోళ్ల సాంబయ్య, మండల వైస్ ప్రెసిడెంట్ ముక్కెర లక్ష్మణ్, నూరుద్దీన్ పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో : సీపీఐ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.అయోధ్య పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మూర్తి, సుధాకర్, ఎస్కె.సర్వార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో....
అంబేద్కర్ జయంతి వేడుకలను సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వి.ప్రభాకర్‌రావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో : అంబేద్కర్ జయంతి వేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జెడ్పీటీసీ పోశం నర్సింహారావు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు ముత్యంబాబు, టౌన్ అధ్యక్షు డు అడపా అప్పారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో...
సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి గిరిజన సంఘం నాయకులు నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు నాగేశ్వరరావు, రాములు పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నందం ఈశ్వ రరావు, నరసింహారావు, రాజు, నాగేశ్వరరావు, రంగారా వు, సత్యవతి, సీత నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : అంబేద్కర్ జయంతి వేడుకలు మందలపల్లి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తూ ఏఐకెఎ స్సిసి రైతు సంఘం, ప్రజాసంఘ నాయకులు, ప్రజలు, దళితులు, గిరిజనులు పాల్గొని పెద్ద ఎత్తున జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్‌రావు, శ్రీనివాసరావు, ఎన్డీ అమర్లపూడి రాము మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పండూరి వీరబాబు, సీపీఐ మండల కార్యదర్శి శివకృష్ణ, ఈశ్వరి, ధర్మ, చందన, నాయకులు లకిëనారాయణ తదితరులు పాల్గొన్నారు.