Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం అంబేద్కర్ భవన పహరి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-కొత్తగూడెం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరి వాడు కాదు...అందరివాడని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం కొత్తగూడెం లోని అంబేద్కర్ భవన్కు సుమారు రూ.14 లక్షలతో నిర్మంచే ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దా మని, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
పోస్టాఫీస్ సెంటర్లో....
అంబేద్కర్ జయంతి వేడుకలలో జిల్లా జెడ్పీ చూర్మెన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే వనమా, కలెక్టర్ ఎంవి.రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అనుధీప్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, దిశా కమిటీ సభ్యుడు పరంజ్యోతి రావు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అంబేద్కర్ కమిటీ సభ్యులు మద్దెల శివకుమార్ పాల్గొన్నారు.