Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు
నవతెలంగాణ-చింతకాని
మండల పరిధిలోని బస్వాపురం గ్రామానికి చెందిన 55 యేండ్ల మహిళ కరోనాతో బుధవారం మృతి చెందింది. మృతి చెందిన మహిళకు అంతిమ సంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులే భయపడుతున్న తరుణంలో అన్నం ఫౌండేషన్ ముందుకొచ్చింది. గ్రామ సర్పంచ్ రాసాల సాంబ లక్ష్మి, ఆమె భర్త సీపీఐ పార్టీ సీనియర్ నాయకులు రాసాల మోహన్ రావు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. పారా లీగల్ వాలంటీర్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాసాల సాంబ లక్ష్మి, అన్నం సేవ ఫౌండేషన్ అన్నం శ్రీనివాసరావు, ఎంపీటీసీ మార్గం కొరివి వీరమ్మ, పంచాయతీ కార్యదర్శి గపూర్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.