Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరకగూడెం
పినపాక నియోజకవర్గంలోని ఏజెన్సీ మండల అభివృద్ధికి కోట్లలో నిధులు మంజూరు చేయించడం జరిగిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలోని ఏజెన్సీ మండల ప్రాంతానికి రూపురేఖలు మారుతాయని, అభివృద్ధికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, ప్రాజెక్టు నివేదికను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఆయన వెనువెంటనే స్పందించి నియోజకవర్గనికి అభివృద్ధి విషయంలో వెనుకాడేది లేదన్నారు. మండలంలోని సమాత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గిరిజన కమ్యూనిటీ హాల్ కోసం సుమారు రూ.50 లక్షల నిధులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా మండలంలోని వివిధ గ్రామపంచాయతిలో మట్టి రోడ్లు, సీసీ రోడ్లుగా మారనున్నాయి. మెతె బ్రిడ్జి, పుల్లతోగు వాగు బ్రిడ్జి, చిరుమళ్ళ నుండి దోమడ వరకు, భట్టుపల్లి నుండి బుర్దారం వరకు కొత్త రోడ్లు నిర్మాణం, వట్టివాగు ప్రాజెక్టు రూ.13కోట్ల 52లక్షలు, పులుసుబొంత ప్రాజెక్టు కోసం రూ.180కోట్ల నిధులు మంజూరుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, ఎంపీపీ రేగా కాళిక, టీఆర్ఎస్వి అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్, పెద్ద రామలింగం, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనువాసు రెడ్డి పాల్గొన్నారు.