Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ మీడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం
మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగానికి ప్రమా దం వాటిల్లనుందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకికవాదులు, ప్రజాతంత్ర వాదులు, కార్మికులు దళితులు వెనుకబడిన తరగతులపై ఉన్నదని భద్రాచలం మాజీ ఎంపీ, రాష్ట్రీయ అధికారిక మంచ్ జాతీయ కన్వీనర్ డాక్టర్ మిడియం బాబురావు అన్నారు. రాజ్యాంగం-ప్రభుత్వ రంగం-సామాజిక న్యాయం అనే అంశంపై సీఐటీయూ-కేవీపీఎస్-గిరిజన సంఘం, భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగ హక్కులకు భిన్నంగా రాజ్యాం గంలోని మౌలిక అంశాలకు నష్టం కలిగించే పద్ధతుల్లో కేంద్ర పాలకుల నిర్ణయాలు తీసుకుంటు న్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ రంగంకు అప్పజెప్పడం ద్వారా రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఢిల్లీ పరిపాలన విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడిందన్నారు. ఏజెన్సీలోని జీవో నెంబర్ 3 ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మౌలిక స్వభావమే రిజర్వేషన్లకు వ్యతిరేకం అని, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ నేటి భారత రాజ్యాంగాన్ని ఆమోదించలేదని తెలిపారు. అందులో భాగంగానే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు కేంద్రం పాల్పడుతుందని విమర్శించారు. ఈ సెమినార్కు గిరిజన సంఘం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీను అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, సీఐటీయూ పట్టణ కన్వీనర్ వై.వెంకట రామారావు, కేవీపీఎస్ పట్టణ అధ్యక్షులు మంద రమణయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎంబీ నరసారెడ్డి, పట్టణ నాయకులు గడ్డం స్వామి, బి.వెంకట రెడ్డి, బండారు శరత్ బాబు, నాగరాజు, జోగారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ భూపేంద్ర, నారాయణ తదితరులు పాల్గొన్నారు.