Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
- అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్న బీజేపీ విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్ అన్నారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పార్టీ అధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్‌కు జోహార్లు అర్పిస్తూ ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం వర్ధిల్లాలి అని, రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని నినాదాలు చేశారు. రైతులు 137 రోజులుగా పోరాటం చేస్తుంటే ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కొండపల్లి శ్రీధర్, జాతోత్ కృష్ణ, భూక్యా రమేష్, మెరుగు ముత్తయ్య, లక్ష్మీ, రమేష్, మహ్మాద్, నాగేశ్వరరావు, సమ్మయ్య, పిల్లి ఆనంద్, రింగు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
రాజ్యాంగంలో పొందుపరచిన కేంద్ర, రాష్ట్ర సంబంధాలు నీరుగారుస్తున్నారని, కార్మిక చట్టాల సవరణ చేసి, ప్రాధమిక హక్కులు లేకుండా చేస్తున్నారని, రాష్ట్ర జాబితాలోని విద్య, వైద్యం, వ్యవసాయం లపై కేంద్రం పెత్తనం చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందా నరసింహారావు అన్నారు. బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాల యంలో జరిగిన అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందా నరసింహారావు, జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగం స్థానంలో భగవద్గీత తెస్తామని గతంలోనే సుష్మా స్వరాజ్ అన్నారని, గత పాలకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి దోపిడి వర్గాలకు అనుకూలంగా వ్యవహరించారని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మొత్తం రాజ్యాంగం సమూలంగా పెకిలించడానికి దూకుడుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ కార్య క్రమం సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొండపల్లి శ్రీ ధర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం.వి.అప్పారావు, ఉపాధ్యక్షులు ఎర్రగాని కృష్ణయ్య, పట్టణ నాయకులు భూక్య రమేష్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు విజయగిరి శ్రీనివాస్, గాజుల రాజారావు, కర్ల వీరాస్వామి, వైవి.రావు, రఘు, సమ్మయ్య, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో : అంబేద్కర్ జయంతి వేడుకలను సింగరేణి హెడ్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్. చంద్రశేఖర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళిఅర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్ బలరాం, డైరెక్టర్ పి.అండ్పడి.సత్యనారాయణ రావు, జీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో : అంబేద్కర్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, నాయకులు బందెల నర్సయ్య, సత్యనారాయణ, శ్రీనివా సరెడ్డి, శ్రీనివాస్, భాస్మర్ తదితరులు పాల్గొన్నారు.