Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
మతోన్మాదం, ప్రైవేటీకరణ, కార్పొరేట్ వంటి కేంద్ర ప్రభుత్వ అనుకూల విధానాలను వ్యతిరేకించడమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మనమిచ్చే ఘన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం స్థానిక బిఎస్ రామాయ భవన్లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం-భారత రాజ్యాంగం అమలు అనే అంశంపై జరిగిన సెమినార్లో వక్తలు మాట్లాడారు. తొలుత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిమ్నవర్గాల అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల అభ్యుదయానికి, సమానత్వం కోసం, కుల నిర్మూలన కోసం అనునిత్యం అవమానాలు భరిస్తూ కృషి చేశారన్నారు. సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని సమసమాజ స్థాపన కోసం భీమ్ రావు ఎనలేని పాటుపడ్డారని వారు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మీద దాడి చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రను ఆలోచిస్తుందని, బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల మహిళలపై దాడులు తీవ్ర రూపం దాల్చిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివ లక్ష్మీనారాయణ, సీఐటీయూ నాయకులు కొండా చరణ్, పాయం రాధాకుమారి, డీవైఎఫ్ఐ నాయకులు బోళ్ళ వినోద్, రాజమ్మ, సమ్మక్క, మచ్చా రామారావు, ఆంధ్రయ్య, బందెల చంటి తదితరులు ఉన్నారు.