Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు బుధవారం పరామర్శించారు. తెల్లపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ పెరుగు రామకృష్ణ తల్లి మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి మామ కోటారెడ్డి ఇటీవల మృతి చెందగా ఆమె కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రేమిడిచర్ల గ్రామానికి చెందిన నామా సేవాసమితి సభ్యులు బుర్ర నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రామకృష్ణ, ఐలూరు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ శిరీష, జెడ్పిటిసి కవిత, ఎర్రుపాలెం మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలి అప్పారావు, బనిగండ్లపాడు సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల బాధ్యుడు వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.