Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
అప్పుల బాధతాళ లేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యజ్ఞనారాయణపురంలో బుధవారం చోటుచేసుకుంది. యజ్ఞనారా యణపురం గ్రామనికి చెందిన కంచపోగు రవి (44) గత కొన్నేండ్లుగా 6 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. పెట్టుబడుల కోసం రూ.5లక్షల వరకు అప్పులు చేశారు. దిగుబడి లేక అప్పులు తీర్చేమార్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.