Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళి
నవతెలంగాణ-వైరా టౌన్
త్యాగాలకు, ఆదర్శాలకు నిలువెత్తు నిదర్శనం కామ్రేడ్ కుంజా బొజ్జి అని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం వైరా సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం మాజీ శాసనసభ్యులు కుంజా బొజ్జి సంతాప సభను నిర్వహించారు. ఈ సంతాప సభలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మాజీ ఎంపిపి బొంతు సమత, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కురగుంట్ల శ్రీనివాసరావు, పట్టణ కమిటీ సభ్యులు మల్లెంపాటి ప్రసాదరావు, హరివెంకటేశ్వరరావు, అనుమోలు రామారావు, కొంగర సుధాకర్, శాఖా కార్యదర్శి గంటా ప్రసాద్, సంక్రాంతి చంద్రశేఖర్, నర్వనేని ఆదిలక్ష్మి, వడ్లమూడి మధు, యనమద్ధి రామకష్ణ తదితరులు పాల్గొన్నారు