Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాధపాలెం
చిమ్మపుడి గ్రామంలో ఏళ్ల తరబడి ఉంటున్న 130 చింతచెట్లను దొంగతనంగా చెట్లను పూర్తిగా ఆనమళ్లు లేకుండా జేసీబీతో తీసివేసిన దుండగులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, వన ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. చింతచెట్లు నరికిన ప్రాంతాన్ని వనజీవి రామయ్య దంపతులు పరిశీలించి నరికిన చెట్లను చూసి మనస్సు చెలించి,నరికిన చింత చెట్లని గుండెకి అద్దుకొని బాధ పడ్డారు. మళ్ళీ అక్కడే చింతచెట్లను వనజీవి రామయ్య దంపతులు నాటించే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, సీపీఎం మండల కార్యదర్శి యస్.నవీన్ రెడ్డి, కాంగ్రెస్ రైతు కిషన్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సిరెడ్డి, మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు కాంగ్రెస్ నాయకులు మారం కరుణాకర్ రెడ్డి, డివైయఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి పొద్దుటూరి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు యలమరెడ్డి, వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జోనెబోయిన పాపయ్య, కొటేరు శేషిదర్రెడ్డి, డివైయఫ్ఐ నాయకులు దశరధ వీరబాబు, జోనేబోయిన నవీన్ పాల్గొన్నారు.