Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
నవతెలంగాణ-ఖమ్మం
కెవిపిఎస్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్. అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని జడ్పి సెంటర్, పాత బస్టాండ్ సెంటర్, రమణ గుట్ట, కైకొండాయి గూడెం గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు గంట భీమయ్య అధ్యక్షతన జరిగిన సభలో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపాటి మనోహర్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ ఎంతో శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తే నేటి మతోన్మాద బీజేపీ పాలకులు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మధ్యయుగాల కాలంనాటి మనువాద సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దాలని, దాంట్లో భాగంగానే రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తూ ప్రభుత్వ రంగాన్ని కారుచౌకగా అంబానీ, ఆధానీలకు కట్టబెట్టి రాజ్యాంగ మౌళిక లక్ష్యాన్ని దెబ్బతీస్తున్న మతోన్మాద పాలకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30వరకు పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్, సంఘం మండల నాయకులు గద్దల వీరబాబు, ఎస్.బాలరాజు, ఎన్. చిరంజీవి, వెంకన్న, గంట సుజాత, సరోజ, చిన్నప్ప, పెంటయ్య, జనార్దన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : రాజ్యాంగంలోని ప్రజల హక్కులను ప్రజాస్వామిక, లౌకిక, విలువలను పరిరక్షించాలనితెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శులు మాదినేని రమేష్, ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ''రాజ్యాంగం పరిరక్షణ దినం'' గా జరపాలని ఏఐకేఎస్‌సిసి పిలుపులో భాగంగా బుధవారం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షా దినంగా పాటించారు. కార్యక్రమంలో నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మేరుగు సత్యనారాయణ, రేపాకుల శివలింగం, మలీదు నాగేశ్వరరావు, వీర్ల వెంకటప్పారావు, బి.ఝాన్సీ, కె.శ్రీనివాస్, ఎస్కె.మీరా, నవీన్‌రెడ్డి, లక్ష్మీ, డి.చందు, కూరాకుల నర్సయ్య, తోట అప్పారావు, మారుతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : భారత దేశ భవిష్యత్తును రాజ్యాంగ పరిరక్షణ ద్వారా మాత్రమే కాపాడుకోగలమని, తద్వారా అంబెడ్కరుకి నిజమైన నివాళి అర్పించినవారమవుతామని సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ అన్నారు. బుధవారం వైరాలో సిపిఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ 130 జయంతి సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాం వద్ధ ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, సిఐటియు వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు, మాజీ ఎంపిపి బొంతు సమత, నర్వనేని ఆదిలక్ష్మి, కురగుంట్ల శ్రీనివాసరావు, మల్లెంపాటి ప్రసాదరావు, హరి వెంకటేశ్వరరావు, కొంగర సుధాకర్, సంక్రాంతి చంద్రశేఖర్, యనమద్ధి రామకష్ణ, గంటా ప్రసాద్ పాల్గొన్నారు
ఠాగూర్ విద్యాసంస్థలో...
స్థానిక ఠాగూర్ విద్యాసంస్థలకు చెందిన క్రాంతి జూనియర్ కళాశాలలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల అధినేత సంక్రాంతి రవికుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యన్ఎస్ఎస్ పిఓ నాగనబోయిన లింగారావు, ప్రిన్సిపల్ చింతనిప్పు కష్ణారావు, అధ్యాపకులు గుంటుపల్లి కృష్ణ, నాగలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
కొణిజర్ల : సిపిఎం ఆద్వర్యంలో మండల పరిధిలోని చిన్నగోపతి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులుర్పించారు. అనంతరం బస్వాపురం సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వైరా అసెంబ్లీ ఇంచార్జ్ వీరభద్రం, మండల కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ, మండల నాయకులు అన్నవరపు వెంకటేశ్వర్లు, కొప్పుల కృష్ణయ్య, డాక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు, లింగాల ధనరాజు, బుర్రి గోపయ్య పాల్గొన్నారు
ముదిగొండ : ప్రపంచ చరిత్రలోనే అంబేద్కర్ గొప్ప మేధావిని ఎస్ఐ తాండ్ర నరేష్ అన్నారు. మండల పరిధిలో చిరుమర్రి గ్రామంలో ఎస్సీ కాలనీ ప్రధాన కూడలిలో అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఆయన బుధవారం లాంఛనంగా ఆవిష్కరించారు. అంబేద్కర్ యువసేన అధ్యక్షుడు ఇనప ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐకేపీ డిపిఎం పోలేపొంగు ఆంజనేయులు, ఐకేపీ ఏపీఎం గంగుల చిన్న వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ బి.వి.రాఘవులు, గ్రామసర్పంచ్ కానుగు సుజాత, ఎంపీటీసీ సభ్యురాలు కొల్లేటి అరుణ, మాజీ సర్పంచ్ ఇనప బాబు, అంబేద్కర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.
ముదిగొండ ప్రధాన సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో తాసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, జడ్పిటిసి పసుపులేటి దుర్గ, ఎస్సై తాండ్ర నరేష్, ముదిగొండ సొసైటీ వైస్ చైర్మన్ బట్టు పురుషోత్తం, ముదిగొండ, పమ్మి గ్రామపంచాయతీ సర్పంచులు మందరపు లక్ష్మి, కొండమీద సువార్త పాల్గొన్నారు.
మధిర : బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మధిర లో అంబేద్కర్ సెంటర్లో 11 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్ అధ్యక్షతన జరిగిన సభలో నామ మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఉద్యమ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగి శెట్టి కోటేశ్వరరావు, ఎంపీపీ లలిత, వైస్ చైర్మన్ శీలం విద్యాలత, మున్సిపల్ కమిషనర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి మండల కార్యదర్శి సగుర్తి సంజీవరావు, సిపిఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, నాయకులు కోటి సుబ్బారెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, దేవరకొండ రామకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండల పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, వైఎస్ఆర్సీపీ కార్యాలయం, బిజెపి కార్యాలయం, ఆయా పార్టీల అధ్యక్షులతో పాటు నాయకులు ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ జయంతి నిర్వహించారు.
వైరా : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్‌లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్ళ పాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, టిఆర్ఎస్ మదల అధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, పట్టణ అధ్యక్షుడు డార్ణ రాజశేఖర్, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జునరావు, రెబ్బవరం ఎంపీటీసీ రాయల రమేష్, కౌన్సిలర్ డాక్టర్ డి.కోటయ్య, కోదండ రామాలయం చైర్మన్ పోలా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
శ్రీనిధి విద్యాసంస్థలో..
మధిర : అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీనిధి విద్యాసంస్థల కరస్పాండెంట్ అండ్ చైర్మెన్, బి.అంజన బాబు, అనిల్ కుమార్‌లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు శ్రీ శేషా చారి, ప్రసాద రావు, కృష్ణయ్య, రామయ్య, వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, మీరా ఖాన్ తదితరులు నివాళులర్పించారు.
ఖమ్మం : ఖమ్మంలోని మూడు బొమ్మల సెంటర్ నందు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆవిష్కరించారు. అనంతరం సుందరయ్య నగర్, డాబాల బజార్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంఛార్జి కృష్ణ, సుడా చైర్మన్ విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బోనకల్ : అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా మాజీ కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతు కోరారు. మండల అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల పరిధిలోని రావినూతల గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం నాయకులు మచ్చ గురవయ్య, డివైఎఫ్ఐ నాయకులు బాణోతు గోపి, గుగులోతు నరేష్, మరీదు వెంకటేష్, కొండ అవినాష్, ధరావత్ హరి, గుగులోతు సాయి, బానోత్ వెంకటేష్, దుర్గాప్రసాద్, వెంకటేష్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.
టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
టిఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బోనకల్ ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవరావు, కాకాని శ్రీనివాస్ రావు, గుమ్మ నాగేశ్వర రావు, కోయి నేని ప్రదీప్ కొమ్మినేని, సత్యనారాయణ, చిలక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు : పట్టణ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహనికి ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాల వేసి నివాళ్లర్పించారు. పెద్దకోరుకొండి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎంఎల్ఏ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవెల్లి రఘు, జడ్పిటిసి కట్టా అజరుకుమార్, రైతు సమన్వయ సమితి మండల కమిటీ అధ్యక్షులు లక్కినేని రఘు, జిల్లా కమిటీ సభ్యులు చందర్రావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని సత్తుపల్లిలో పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని తన నివాసంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన భవన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఛైర్మెన్ కూసంపూడి మహేశ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, కౌన్సిలర్లు ఎస్కే చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, రాఘవేంద్ర, మేకల భవాని, కంటె నాగలక్ష్మి, దూదిపాల రాంబాబు, నాగుల్‌మీరా, మారుతి సూరిబాబు, ఆయూబ్‌పాషా, రూత్ క్రిస్టియానా, నాయకులు కొత్తూరు ప్రభాకరరావు, అమరవరపు కృష్ణారావు, నడ్డి ఆనందరావు, ఎండీ అబ్దుల్లా, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, రామిశెట్టి కృష్ణ పాల్గొన్నారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో....
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) సత్తుపల్లి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడమే మనం అంబేద్కర్‌కు ఇచ్చే ఘన నివాళి అని యూటీఎఫ్ నాయకులు అన్నారు. మండలశాఖ అధ్యక్షుడు బాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మట్టపర్తి రాజేశ్వరరావు, నాయకులు ఐ.నాగేశ్వరరావు, అశోక్‌చక్రవర్తి, హెచ్.సూరయ్య, సీనియర్ నాయకులు బి.బాలయ్య, కె. చక్రపాణి, కార్యకర్తలు ఎస్.పుల్లారావు, బి.వినోద్, బి.నగేశ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని జరిపారు. కార్యక్రమంలో పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్‌రాజు, శివా వేణు, నాయకులు పాల్గొన్నారు.
పొంగులేటి క్యాంపు కార్యాలయంలో...
ఖమ్మం: అసమానతలను రూపుమాపేందుకు రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్‌రెడ్డి అన్నారు. భారతరత్న బీఆర్ అంబేద్కర్ 130 జయంతి వేడుకలను పొంగులేటి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహిం చారు. కార్యక్రమంలో కొప్పెర ఉపేందర్, దొడ్డా నగేష్, వరద నర్సింహారావు, దుంపల రవికుమార్, బాణాల లక్ష్మణ్, భీమనాధుల అశోక్‌రెడ్డి, నారుమల్ల వెంకన్న, ఇమ్మడి తిరుపతిరావు, ఏవీ నాగేశ్వరరావు, బండ రవి, భీరేష్ పాల్గొన్నారు.
బోనకల్ : ప్రపంచం మొత్తం గర్విస్తున్న మహా మేధావి బిఆర్ అంబేద్కర్ అని సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు కొనియాడారు. అంబేద్కర్ జయంతి వేడుకలను స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుగులోతు నరేష్, చెన్న లక్షాద్రి, మచ్చ గురవయ్య, ఏసు పోగు బాబు, బిల్లా విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి : అంబేద్కర్ జయంతి వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సునీతా రాందాస్, ఎంపిటిసి గబ్రూ నాయక్ పాల్గొన్నారు.
గాంధీ చౌక్ : ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్లతో కలిసి జిల్లా పరిషత్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన 14 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఆవిష్కరించారు. జడ్పీ సెంటర్‌ను అంబేద్కర్ సెంటర్‌గా నామకరణం చేశారు.
ఖమ్మంరూరల్ : జలగంనగర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పిటిసి వరప్రసాద్‌లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని పలు గ్రామాల్లో సీపీఎం, కేవీపియస్, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమలలో సిపిఎం నాయకులు నండ్ర ప్రసాద్, పొన్నెకంటి సంగయ్య, బందెల వెంకయ్య, నందిగామ కృష్ణ, పి.మోహన్‌రావు, బత్తినేని వెంకటేశ్వర రావు, రంగారావు, తమ్మినేని కోటేశ్వరరావు, ఉరడీ సుదర్శన్‌రెడ్డి, సిద్దినేని కోటయ్య, పొన్నం వెంకట రమణ, యామిని ఉపేందర్, కర్లపూడి వెంకటేశ్వర్లు, ఏటుకూరి ప్రసాద్‌రావు, వట్టికోట నరేష్, పల్లె శ్రీనివాసరావు, కెవిపిఎస్ నాయకులు పాపిట్ల సత్యనారాయణ, కుక్కల సైదులు, ఏపూరి వరకుమార్, అనిష్, రామనాధం, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు వినోద్, సైదారావు, బుచ్చిబాబు, నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి : విఎం బంజర్ అంబేద్కర్ సెంటర్లో దళిత సంఘాలు, సిపిఎం, సీఐటీయూ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఎంప్లాయిస్, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, పౌరహక్కుల సంఘం, హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో రాజేశ్వరరావు అధ్యక్షతన అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చలమాల విఠల్ రావు మాట్లాడారు. విఎం బంజర్ సర్పంచ్ భూక్యా పంత్, వైస్ సర్పంచ్ వంగా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల నాయకులు టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, మందరపు వెంకన్న, మందరపు పద్మ, మంకెన దామోదర్, బట్టు పురుషోత్తం, బలంతు యుగంధర్, ఇరుకు నాగేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు, మర్లపాటి కోటేశ్వరరావు, ఉప్పు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : కుల పీడనను తుదముట్టించేందుకు పోరాడిన యోధుడు బి.ఆర్ అంబేద్కర్ అని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి అన్నారు. అంబేద్కర్ జయంతిని ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు మెరుగు రమణ, మేహరున్నిసా బేగం, బాగం అజిత, గొడుగు రమ తదితరులు పాల్గొన్నారు.
మధిర : అంబేద్కర్ జయంతి వేడకలను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మధిరలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు, నాయకులు మండవ కృష్ణారావు, రామ నరసయ్య, రిటైర్డ్ ఎంఈఓ అనుమోలు భాస్కర్‌రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు, గోపి, ప్రముఖ న్యాయవాది దిరిశాల జగన్మోహన్రావు, శంకర్రావు, రాధాకృష్ణ, శ్రీను , నాగమల్లేశ్వరరావు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.