Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి రాంబాబు
నవతెలంగాణ-బోనకల్
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిలో టీఎస్ యుటిఎఫ్ ఛాంపియన్గా పనిచేస్తుందని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండ రాంబాబు అన్నారు. టీఎస్ యుటిఎఫ్ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని బోనకల్ మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు పిల్లలమర్రి వెంకట అప్పారావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ జివోలను విడుదల చేయాలని, విద్యావాలంటీర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు కంభం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎంసిఆర్ చంద్రప్రసాద్, ఉపాధ్యక్షురాలు పి.సుశీల, కోశాధికారి ఆలస్యం పుల్లారావు, నాయకులు అనిల్ కుమార్ శ్రీనివాస రావు వీర బ్రహ్మ చారి జూబీద వెంకట నర సమ్మ, సైదారావు, రవికుమార్, సైదులు పాల్గొన్నారు.
మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ
టీఎస్ యుటిఎఫ్ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోనకల్ మండల కేంద్రంలోని శాంతి నిలయం లోనే మానసిక వికలాంగుల కు టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పండ్లు పంపిణీ చేశారు.