Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతులు లేకుండా నిర్మిస్తున్న తీరుపై ఆగ్రహం
- సంబంధిత అధికారుల వివరణ కోరిన కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చుంచుపల్లి మండలం విద్యా నగర్ కాలనీలో గిరిజన చట్టానికి విరుద్ధంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని కలెక్టర్ ఎంవి.రెడ్డి గురువారం సందర్శించారు. భవన నిర్మాణ యజమాని గురించి అడిగి తెలుసుకున్నారు. 1/70 గిరిజన భూముల్లో గిరిజన చట్టాలుకి వ్యతిరేకంగా భవన నిర్మాణం చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనేతరుల అయిన భవన నిర్మాణ యజమాని ఊకంటి గోపాలరావు విద్యానగర్ కాలనీలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. ఈ స్థలము నాదే అంటూ గిరిజనుడు బోడా జనార్ధన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరువురి మధ్య ఉన్న కేసు కారణంగా భవన నిర్మాణాలు జరుగుకుండా ఉండాలని సంబంధిత అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టును ఆశ్రయించిన జనార్ధన్ కేసు తుది తీర్పు వెలువడకుండానే కక్షిదారుడు తానువేసిన కేసునుండి మధ్యలో విశ్రమించడానికి ప్రయత్నించాడు. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దీన్ని తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర హైకోర్టు ఈ విషయమై కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసినట్టు సమచారం. భవన నిర్మాణ సముదాయాన్ని సందర్శించి దానికి సబంధించిన నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఎంవి.రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సంబంధిత పంచాయతీ ఈఓ రియాజ్ అహ్మద్‌ను ప్రాధమికంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్రమ నిర్మాణం విషయంలో పలు దఫాలుగా నోటీసులు జారీ చేసినట్టు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. అధికారులు ఉత్తర్వులు బేఖాతరు చేసి నిర్మాణాలు చేశాడని సంబంధిత అధికారులు కలెక్టర్ వివరించారు. ఆగ్రహానికి గురైన కలెక్టర్ నిర్మాణదారులకు సంబంధించిన బంధువులను హెచ్చరించారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి నిర్మాణం చేస్తారా...అని, కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్, ఎంపీడీవో రమేష్, తాసిల్దార్ నాగరాజు, డిఎల్పిఏ, విద్యానగర్ సర్పంచ్ గోవింద్, ఈవో రియాజ్ అహ్మద్, తదితరులున్నారు.