Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోండి
- కమిషనర్ శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-ఇల్లందు
మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో గల కమ్యూనిటీ హాల్లోని గదులు వేలము వేస్తున్నట్టు కమిషనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజన్ కుమార్‌లు గురువారం విలేకర్లకు తెలిపారు. నెలసరి అద్దె ప్రాతిపదికన మూడు సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. రెండ దుకాణ సముదాయములు 21.00 విస్తీర్ణంతో మున్సిపాలిటీ నిర్ణయించిన అద్దె రూ.3వేలు. హాలు 442.63 చ.మీ నెల సరి అద్దె రూ.27వేలు. ధరావతు సొమ్ము దుకాణములకు రూ.10వేలు, కమ్యూనిటీ హాల్‌కు రూ.50వేలు కమిషనర్ పురపాలక సంఘం పేర ఏదైనా బ్యాంకులో డీడీ తీయాలన్నారు. దరఖాస్తు ఫారం రూ.వెయ్యి చెల్లించి కార్యాలయంలో పొందవచ్చన్నారు. కార్యాలయంలో దరఖాస్తుతోపాటుగా 23న మధ్యహ్నాం 3 గంటలకు సమర్పించి ఏప్రిల్ 24న జరగనున్న వేలంలో పాల్గొనాలి. వేలంలో మరింత సమాచారం కోసం మున్సిపాలిటీ పనివేళల్లో సంప్రదించవచ్చని వారు తెలిపారు.