Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల వినతులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం
- అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం గోదావరి నదిపై నిర్మించే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతుల అవార్డు ఎంక్వైరీ గ్రామ సభలు గురువారం నిర్వహించారు. దుమ్ముగూడెం, ప్రగళ్లపల్లి, కాశీనగరం గ్రామాల్లో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు భూ సేకరణ అధికారి అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఏజన్సీలో ప్రభుత్వ రిజిష్టారు లెక్కల ప్రకారం ఎకరాకు రూ.80 వేల ఉందని దీనికి నాలుగు రెట్లు రూ.3 లక్షల 20 వేల అందజేస్తామని తెలిపారు. దీంతో రైతులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం వ్యతిరేకించడంతో పాటు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు వినతి పత్రాలు అందజేశారు. సీతమ్మ సాగర్ కరకట్ట నిర్మాణంతో కోల్పోతున్న భూములు సారవంతమైనవని కావడంతో పాటు రెండు పంటలు పండుతాయని, ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరం రూ.13 నుండి 17 లక్షలు ఉందన్నారు. ఒక్కో ఎకరానికి రూ.50 లక్షలు, లేదా భూమికి భూమి ఇవ్వాలని, ఇంటికి ఒక ఉద్యోగం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్వాసిత రైతులు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల డిమాండ్లను కలెక్టర్ ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళతానన్నారు. గ్రామ సభల్లో డీఏఓ రాజన్న కుమార్, తహశీల్దార్ రవికుమార్, వీపీసీ రమణారావు, ఆర్ఐ ఆదినారయణ, ఇరిగేషన్ అధికారులతో పాటు దుమ్ముగూడెం, ప్రగళ్లపల్లి, కాశీనగరం సర్పంచ్లు మడి రాజేష్, జుంజురి లకీë, కనకదుర్గ తదితరులు ఉన్నారు.