Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేవస్థానం నిర్ణయం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరగనున్న కార్యక్రమాలు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది మంది సిబ్బందితో నిత్యకల్యాణ మండ పంలోనే అంతరంగికంగా నిర్వహించనున్నారు. భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఈ ఉత్సవాలకు భక్తులకు ప్రవేశం నిషేధించడమైనదని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఈవో బి.శివాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవస్థానంలో ఈ నెల 13 నుంచి 27 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మౌత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన ఎదుర్కోలు ఉత్సవం, 21 శ్రీ రామ నవమి, 22న శ్రీరామ మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండ గా కోవిడ్-19 పాటిస్తూ కొద్ది మంది సిబ్బంది సమక్షంలో అంతరంగికంగా నిర్వహించనున్నారు. అదే విధంగా ఈ నెల 21, 22న ఈ రెండు రోజులు ఆలయంలో జరిగే స్వామివారి అన్ని రకాలైన దర్శనాలు రద్దు చేయడం జరిగింది. కాగా శ్రీరామనవమి మహా పట్టాభిషేకం తదితర ఉత్సవాలను ఎస్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని, భక్తులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ ఉత్సవాలను వీక్షించాలని ఈవో పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.