Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువకుడు దుర్మరణం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో ద్విచక్ర వాహనాన్ని, లారీ ఢీ కొన్న సంఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసుల కధనం ప్రకారం... భద్రాచలంకు చెందిన వడ్ల కుంట్ల మహేంద్ర (28) ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో తోపుడు బండిపై బట్టలు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వడ్లకుంట్ల మహేంద్ర వస్తుండగా చత్తీస్ఘడ్ నుంచి చెన్నై వెళ్తున్న టీఎస్ 70, జె4563 నెంబర్ గల లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేంద్ర అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న మహేంద్ర కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ టి.స్వామి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.