Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బాధితునికి రూ.20 వేలు, నిత్యావసర సామగ్రి వితరణ
నవతెలంగాణ-చర్ల
తమతోపాటు చిన్ననాటి నుండి విద్యాబుద్ధులు నేర్చు కున్న బాల్య స్నేహితురాలి భర్త కరోనా భారిన పడి అవస్థలు పడుతున్న క్రమంలో మేము న్నామంటూ ఆపన్న హస్తాలు అందించడానికి ముందుకు వచ్చారు 1993-94 సంవ త్సరంలో చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సీ చదివిన పూర్వ విద్యార్థులు. గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేదలను ఆదుకోవడంతో పాటు, తనతో పాటు బాల్యంలో చదువు నేర్చుకున్న బాల్య మిత్రులకు ఎక్కడ ఆపద వచ్చినా ముందుకు వస్తూ వేయ ప్రయాసల కూర్చి సహాయం అందిం చడం లో తమదైన శైలి ప్రదర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే మండలంలోని గుంపన గూడెంకు చెందిన ఎస్ఎస్సీ బ్యాచ్‌కు చెందిన హసీనా భర్తకు కరోనా పాజిటివ్ రావడంతో వారికి రూ.20,000తో పాటు, నిత్యావసర వస్తువులు, దుస్తులు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారికి హసీనా కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎడారి రమేష్, నాగేంద్ర తిరుపతి, బి.ప్రసాద్, శ్రీను, డి.హరి నాగ వర్మ, మాధురి, లక్ష్మి, రాజేశ్వరి, రమాదేవి, విమల, మంగ వేణి తదితరులు ఉన్నారు.