Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని లక్ష్మీపురం పంచాయతీలో అదనపు కలెక్టర్ గురువారం ఆకస్మిక పర్యటన చేశారు. తొలుత పంచాయతీ పరిధిలో రోడ్లకు ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో తెల్లవారుజామున కురిసిన వర్షానికి కొన్ని నేలవాలడంతో వాటిని సిబ్బందితో సరిచేయించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి అందులో మొక్కలు తక్కువగా ఉండటంతో ఇంకా కొన్ని మొక్కలు నాటాలని, అదేవిధంగా పల్లెప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ సోంపాక నాగమణి, కార్యదర్శి ఫణీంద్రలకు సూచించారు. అనంతరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడ రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా ముసలిమడుగు గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనుల్లో భాగంగా పల్లెప్రకృతివనం, వైకుంఠదామం, డంపింగ్ యార్డు, నర్సరీలను ఆయన పరిశీలించి సర్పంచ్ కుర్సం వెంకటరమణ, కార్యదర్శి రేష్మలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీఎల్పీవో పవన్‌కుమార్, ఎంపీడీవో శంకర్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.