Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7పాజిటీవ్ కేసులు
నవతెలంగాణ-ఇల్లందు
45 ఏండ్ల పైబడినవారికి ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సిన్ వేస్తున్న సందర్భంలో నర్సులు చేతులకు గ్లౌజులు వేసుకోవడం లేదు. దీంతో బాధితులు భయాందోళలకు లోనవుతున్నారు. ఓపీ, వ్యాక్సిన్ కోసం వందలాది మంది ప్రభుత్వ వైద్యశాలకు వస్తుంటారు. అసలే పట్టణంలో రోజురోజుకు పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రముఖ సంఘ సేవకుడు, గాయత్రి పరివార్ యుగనిర్మాణ్ మిషన్, జంతు సంక్షేమ బోర్డు సభ్యులు సతీష్ ఖండేల్వాల్ వ్యాక్సిన్ వేసుకోగా నర్సులు చేతులకు గ్లౌజులు ఉపమయోగించలేదు. ఇంతే కాకుండా వైద్యులతో పాటుగా ల్యాబ్ టెక్నిషయన్స్, ఫార్మాసిస్ట్స్ ఇలా అనేకమంది విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడ గ్లౌజులు వేసుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
7 పాజిటీవ్ కేసులు నమోదు
పట్టణంలో గురువారం 7 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇందిరానగర్, ఆంబజార్, రెండు చొప్పున, కాకతీయ నగర్, వినోభకాలని, జెకె ఏరియాలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.