Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ప్రజలకు చేరువవ్వలేదని బీజేపీ మండల అధ్యక్షుడు ధూళిపూడి శివప్రసాద్ అన్నారు. గురువారం దుగినేపల్లిలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మిషన్ భగీరథ వల్ల ప్రజలకు చేకూరిందేమీ లేదన్నారు. కానీ కాంట్రాక్టర్ల జేబులు నిండాయన్నారు. ప్రభుత్వం ఏ పని చేపట్టినా కాంట్రాక్టర్ల కోసం కాక ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.