Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
అకాల వర్షం, గాలి దుమారం కారణంగా మొక్కజొన్న, వరి, మిర్చి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అఖిలభారత రైతుకూలి సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు సర్వే చేసి పంట నష్టపోయిన రైతులను గుర్తించి, ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్) ద్వారా రైతు పండించిన మొక్కజొన్న, వరి, తదితర పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వాగబోయిన రామక్క, రోళ్ల గడ్డ ఎంపీటీసీ కల్తి రాజేశ్వరి, శంభునిగూడెం ఎంపీటీసీ పర్శిక పద్మ, గుండాల సర్పంచ్ కొమరం సీతరాములు, శెట్టుపల్లి సర్పంచ్ బచ్చల ప్రమీల, ఉప సర్పంచ్ మానాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.