Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని తుమ్మలచెరువు పంచాయతీలోగల కుర్వాపల్లి కొత్తూరు రైతులు గత ఐదు రోజులుగా చేపడుతున్న దీక్షలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదే కేశవరెడ్డి, ఓరుగంటి భిక్ష్మయ్య, వెంకటరమణ మద్దతు తెలిపారు. గురువారం దీక్షా శిభిరాన్ని చేరుకున్న పాయం వారికి భరోస నిచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి పోడుదారుల సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తానని హామి ఇచ్చారు. మద్దతు తెలిపినవారిలో ఉపెందర్, పాములు, వంకా సత్యనారాయణ, మడకం సాదు, సైదులు ఉన్నారు.