Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల సంక్షేమమే పోలీసుల లక్ష్యమని ఇల్లందు డీఎస్పీ పి.రవీందర్రెడ్డి, టేకులపల్లి సీఐ భానోత్ రాజు అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ, సీఐ రాజు, బోడు ఎస్సై రవీందర్లు మారుమూల గ్రామాల్లో వలసలు వచ్చిన ఆదివాసీ కుటుంబాలకు మండలంలోని నాగరాంజోగు గోత్తి కోయ గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్భంగా కుటుంబీకులకు ఉచితంగా వాటర్ ఫిల్టర్లను పంపిణీ చేశారు. మిగతా గ్రామాలకు చెందిన వలస ఆదివాసీ కుటుంబాలకు కూడా వాటర్ ఫిల్టర్స్ ను పంపిణీ చేస్తామని తెలిపారు.
ఆదివాసీలకు సురక్షిత నీరు అందించేందుకు ఫిల్టర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని అంటు వ్యాధులు రాకుండా కాపాడుకోవాలని సూచించారు. ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలోని గిరిజన వలస ఆదివాసీల సంక్షేమం కోసం సబ్ డివిజన్ పోలీసుశాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. గ్రామీణ గిరిజన యువత చెడు మార్గంలో నడవకూడదనే ఉద్దేశంతో యువత పలు రకాల క్రీడాల్లో ఉత్సాహము చూపాలన్నారు. కరోనా వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతోని చెల్క సర్పంచ్ నీలమయ్య, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ సిబ్బంది, సివిల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.