Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజుల్లో రెట్టింపైన పాజిటివ్ కేసులు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోవిడ్-19 కరోనా వైరస్ విజృంభిస్తుంది. గత కొంత కాలంగా జిల్లాలో నామమాత్రం పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. గత వారం రోజుల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. గురువారం జిల్లా వ్యాప్తంగా కరోనా 245 పాజిటివ్ కేసులు రావడం భయాందోళన కలిగిస్తుంది. ఈ నెల7వ తేదీన 27 కేసులు, 11వ తేదీన కేవలం 56 పాజిటివ్ కేసులు వచ్చాయి. జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు, పాల్వంచలలో 154 కేసులు, భద్రాచలంలో 55 కేసులు మొత్తంగా 245 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 45 సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్న తరుణంలో కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.