Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరుచూ విద్యుత్ అంతరాయం
- మూడు రోజుల పాటు మరమ్మతులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రస్తుత నియోజక వర్గం కేంద్రమైన అశ్వారావుపేటలో 30 యేండ్ల నాటి విద్యుత్ సబ్ స్టేషన్‌తో సాంకేతిక లోపంతో తరుచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో నిరంతర సరఫరా కోసం మూడు రోజుల పాటు సరపరా తాత్కాలికంగా నిలుపుదల చేసి పునరుద్దరణ పనులు అధికారులు చేపడుతున్నారు. 30 యేండ్ల నాడు అశ్వారావుపేట అప్పటి విద్యుత్ అవసరాలు రీత్యా సబ్ స్టేషన్ నిర్మించారు. కాల క్రమేనా జనాభా పెరుగుదల దీనికి అనుగుణంగ గ్రామాలు విస్తరించడంతో పాటు గృహా అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం సైతం రెట్టింపు అయింది. కానీ ఈ మేరకు సబ్ స్టేషన్ పనితనం మాత్రం పెరగలేదు. ఈ కారణంగా తరుచూ విద్యుత్ సరఫరాకు అంతరాయంతో పాటు ట్రాన్స్ ఫారాలు అగ్నిప్రమాదాలు గురి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సబ్ స్టేషన్‌ను పునరుద్ధరించడానికి గతేడాది విద్యుత్ శాఖ నిధులు కేటాయించింది. దీంతో అధికారులు పనులను ముమ్మరం చేసారు.
మండల పరిధిలో గల ఆసుపాకలో ఉన్న 400/220 కిలో వాట్స్ విద్యుత్ సరఫరా కేంద్రం నుండి వచ్చే విద్యుత్ కోసం అశ్వారావుపేటలో 220/132 కిలో వాట్స్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రం నుండి సరఫరా అయ్యే విద్యుత్ కోసం అశ్వారావుపేటలోనే మరో 132/33 కిలో వాట్స్ సబ్ స్టేషన్‌కు అను సంధానం చేసారు. ఇక్కడ నుండి క్షేత్రస్థాయికి విద్యుత్ అందించడం కోసం 33/11 సబ్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుండే మండల పరిధిలో గల అశ్వారావుపేట టౌన్, వినాయకపురం, నారంవారిగూడెం, గంగారం ఫీడర్లతో పాటు దమ్మపేటకు విద్యుత్ సరఫరా అందుతుంది. ఈ ఫీచర్లు నుండి 11/440 వోల్ట్స్గా గృహాలకు, వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే వీటి పరిధిలో 4300 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫారాలు, 300 కిలోమీటర్లు విద్యుత్ లైన్ల నిర్మాణం ఉంది.
అయితే నూతనంగా నిర్మించిన 220/232 విద్యుత్ సరఫరా కేంద్రానికి పురాతన మైన 132/33 విద్యుత్ సరఫరా కేంద్రానికి సాంకేతిక అనుసంధానం కాకపోవడంతో తరుచూ అంతరాయం ఏర్పడుతుంది. ఈ రెండింటినీ సాంకేతికంగా అనుసంధానం చేయడం ద్వారా విద్యుత్ అంతరాయం నివారించడంలో పాటు నాన్యమైన విద్యుత్ సరఫరాకు దోహద పడుతుందని ఎన్పీడీసీఎల్, ట్రాన్స్ కో ఏడీఈలు రామక్రిష్ణ, వెంకటేశ్వర్లు, ఏఈలు ప్రసాద్, ప్రభాకర్‌లు తెలిపారు. వీరు నిర్విరామంగా పునరుద్దరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.