Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భార్య మందలించిందని మనస్థాపంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన గురువారం గోవిందాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోవిందాపురం గ్రామానికి చెందిన పొడియం కృష్ణ (38) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడు. భార్య జానికమ్మ, కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు చెప్పినా అతనిలో మార్పు రాలేదు. ఈ నెల 14వ తేదీ బుధవారం రాత్రి సమయంలో బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య మందలించింది. మనస్థాపంతో కృష్ణ అందరూ పడుకున్న సమయంలో ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యం కోసం భద్రాచలం తీసకు వెళుతుండగా మార్గ మద్యలో మృతి చెందాడు. భార్య జానికమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.