Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఆ పార్టీ సీనియర్ నేత పోట్ల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఖమ్మంలోని సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ టిఆర్ఎస్ పార్టీ చెప్పుచేతల్లో పని చేయడం విచారకరమన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు ముందే లీక్ చేసిందని విమర్శించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మంత్రుల పర్యటనను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించేందుకు సిపిఎం, సిపిఐ, టిడిపి, టీజేఎస్ కలిసిరావాలని లేఖలు రాశామన్నారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మేయర్ దక్కించుకుంటామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్న అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు వడ్డేబోయిన నర్సింహరావు, నాగండ్ల దీపక్ చౌదరి, తిలక్, జావీద్, కార్యాలయం ఇన్చార్జ్ రాధాకృష్ణ పాల్గొన్నారు.