Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
మండలపరిధిలో చిరుమర్రి గ్రామంలో మిర్చిని దొంగలించిన కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఖమ్మం రూరల్ సిఐ పి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. గురువారం ముదిగొండ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదిగొండ ప్రధానరహదారిలో ఆ ముగ్గురు నిందితులతో పాటు బొలెరో వాహనంలో ఉన్న ఏడుక్వింటాల మిర్చిని స్వాధీనపరుచు కున్నమని ఆయన చెప్పారు. అపరిచిత వ్యక్తులు గ్రామాలలో సంచరిస్తుంటే 100 గాని పోలీస్ స్టేషన్ గాని సమాచారం ఇవ్వాలన్నారు. మిర్చిని దొంగలించిన ముగ్గురు నిందితులు కలకత్తా నుండి గత రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చి సెంట్రింగ్ పనులు నిర్వహిస్తూ దొంగతనాలకు అలవాటుపడి చిరుమర్రిలో మిర్చీని దొంగిలించినట్లు సిఐ తెలిపారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టుకు హాజరు పరిచినట్లు సిఐ చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎస్సై తాండ్ర నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.