Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగి కుటుంబ సభ్యులపై సెక్యూరిటీ దాడి
- ఇరు వర్గాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ దళిత కుటుంబానికి చేదు అనుభవం ఎదురైయింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మంకు చెందిన కంచర్ల రాణి 4 నెలల గర్భణి. బుధవారం సాయంత్రం కడుపు నొప్పి రావడంతో జిల్లా ఆసుపత్రిలోని మాత శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి రాణికి గర్భస్రావం అయింది. దీంతో రోగి తల్లి రాయవరపు లలిత, అమ్మమ్మ పడిగిపల్లి రాములమ్మ గురువారం ఉదయం రాణికి టిఫిన్ తీసుకువచ్చేందుకు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. టిఫిన్ తీసుకొని ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నంచగా సెక్యూరిటీ అడ్డుకొని చెప్పలు బయట విడిచి రావాలని చెప్పడంతో చెప్పలు విడిచి లోపలకు వెళ్లేతుండగా తిరిగి సెక్యూరిటి అడ్డుకుకొని పాస్ ఉంటేనే లోపలికి వెళ్లాలని చెప్పడంతో తమ పాస్ లోపల ఉండి పోయిందని తమ కుమార్తకు టిఫిన్ పెట్టి మందులు ఇవ్వాలని దయచేసి పంపించాలని కోరారు. అయినా పంపించబోమని చెప్పడంతో చేసిది ఏమిలేక లోపలకి వెళ్లేందుకు ప్రయత్నిచండంతో అడ్డుకొని నెట్టివేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రోగి బంధువుల లోపలికి వెళ్తుండగా ఇద్దరు సెక్యూరిటి గార్డులు వచ్చి అడ్డు పడి తమను కర్రాలతో కొట్టారని తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని ఆందోళనలు నిర్వహించారు. ఆసుపత్రి ఆర్ఎంవో శ్రీనివాసరావు, నందగిరి శ్రీనివాసరావు అక్కడకు చేరుకొని సర్ధిచెప్పి పంపించారు. దీంతో ఇరువురు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.