Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో సత్తుపల్లికి చెందిన ఇద్దరు సామాజిక సేవకులకు తెలుగుతేజం జాతీయస్థాయి పురస్కారాలు రావడం అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లికి చెందిన పురస్కార గ్రహీతలు అయిన సామాజిక సేవకురాలు, అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కొనకళ్ల సుధారాణి, ప్రముఖ యోగా శిక్షకులు, సామాజిక సేవకులు, ఉపాధ్యాయుడు చల్లగుళ్ల అప్పారావులను గురువారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాలను సమాజానికి అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. కరోనా కష్టకాలంలో పేదలకు ఆసరా నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, నాయకులు గాదె సత్యనారాయణ, చల్లగుళ్ల నరసింహారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, గురుజ్యోతి అధ్యక్షుడు చిత్తలూరి ప్రసాద్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్‌కుమార్, రామకృష్ణ యోగా సమితి సభ్యులు కృష్ణారెడ్డి, రాజరత్నచారి, విజయశ్రీ, సర్వేశ్వరరావు, రాజ్యలక్ష్మి, సుభాశ్ యువజన సంఘం అధ్యక్షులు పీఎల్ ప్రసాద్, బొంతు కృష్ణారావు, శారద రెసిడెన్సీ సభ్యులు చిట్టిరావు, రంగారావు, శర్మ, కేశవరావు, సృజన సాహితి బాధ్యులు గట్టే వాసు పాల్గొన్నారు.