Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి మాలతి
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా కరోనా కట్టడికి చర్యల్లో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు 14 ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా కేసులు చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చామని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.మాలతి అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యలు, డాక్టర్లు, నోడల్ అధికారులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 27 ఆస్పత్రులలో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ చికిత్స కేంద్రాలు సేవలు అందించాలని సూచించారు. కోవిడ్ పరీక్షలు ర్యాపిడ్ టెస్ట్, ఆర్టి పిసీఆర్ టెస్ట్ ఖర్చు వివరాలు, చికిత్స సంబంధించి వివరాలు బెడ్, ఓపీ వివరాలు అన్ని ప్లెక్స్ తయారు చేసి ఆస్పత్రి బయట ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్‌కు సంబంధించి కోవిడ్ పోర్టల్ ఆన్లైన్ నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్, శానిటైజర్స్ ఉపయోగించే విధంగా సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్వో డాక్టర్ కోటిరత్నం, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సురేందర్, తదితరులు పాల్గొంన్నారు.
జిల్లాలో కోవిడ్ చికిత్స అందించే ఆసుపత్రులు
- ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి
- ఆయూష్ ఆసుపత్రి ఖమ్మం
- ఆరోగ్య మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఖమ్మం
- మమత మెడికల్ కాలేజి ఖమ్మం
- మేఘన ఆసుపత్రి ఖమ్మం
-న్యూలైఫ్ ఎమర్జీన్సీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఖమ్మం
- ప్రశాంతి ఆసుపత్రి ఖమ్మం
- సమత ఆసుపత్రి ఖమ్మం
- సంకల్ప ఆసుపత్రి ఖమ్మం
- శ్రీ బాలాజీ ఏషియన్ ఆసుపత్రి ఖమ్మం
- శ్రీరాం కిడ్ని ఆసుపత్రి ఖమ్మం
- తేజస్వ్ ఆసుపత్రి ఖమ్మం
- తెలంగాణ ఆసుపత్రి ఖమ్మం
- శ్రీఅభయ ఆసుపత్రి ఖమ్మం
-శ్రీబాలాజీ చేస్ట్ అండ్ డయాబెటిస్ ఆసుపత్రి ఖమ్మం
- ఉషోదయ ఆసుపత్రి ఖమ్మం
- కోప్స్ చేస్ట్ ఆసుపత్రి ఖమ్మం
- శ్రీసాయి మారుతి జనరల్ ఆసుపత్రి ఖమ్మం
- స్పర్శ న్యూరో ఎమర్జీన్సీ ఆసుపత్రి ఖమ్మం
- హైకేర్ ఆసుపత్రి మధిర
- విష్వాస్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఖమ్మం
- స్వాతి ఆసుపత్రి ఖమ్మం
- బ్రీత్ చెస్ట్ ఆసుపత్రి ఖమ్మం
- శ్రీకృష్ణ ఆసుపత్రి ఖమ్మం
- సాకేట్ క్రిష్టా ఆసుపత్రి వైరా
- బృందా ఆసుపత్రి ఖమ్మం
- సురక్షా ఆసుపత్రి ఖమ్మం