Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
సీపీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసు స్టేషన్లో మండలంలోని ప్రజాప్రతినిధులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైరా ఏసీపీ సత్యనారాయణ గండికోట మొగిలి హాజరై మాట్లాడుతూ కరోనా రెండోవదశ తీవ్రంగా ఉందని ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు మాస్క్లు ధరించడంపై అవగాహన కల్పించి కరోనా నివారణకు సహకరించాలన్నారు. మాస్క్ ధరించిన వారికి చట్టపరంగా రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వసంత్ కుమార్, ఎస్ఐ గండికోట మొగిలి సిబ్బంది ఉన్నారు.