Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుకి ఇరువైపులా అడ్డగోలుగా లారీలు నిలిపివేత
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కొణిజర్ల
ఈఫోటో చూడగానే రహదారా.. పార్కింగ్ ప్రదేశామాననే. సందేహం తప్పకుండా వస్తుంది..రోడ్డుకి ఇరువైపులా లారీలు అడ్డగోలుగా నిలిపివేయడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురౌతున్నారు. పల్లిపాడు నుంచి ఏన్కూర్ వెళ్ళే రోడ్డు గత ఐదు సంవత్సరాల క్రితం డబల్ రోడ్ కావడంతో వాహనల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ రహదారిగుండా భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, చత్తీస్‌గఢ్‌కు భారీ వాహనాలు రాకపోకలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా చుట్టపక్కల గ్రామాల నుంచి వందల సంఖ్యలో ఆటోలు, బైక్‌లు తిరుగుతూన్నాయి. రహదారి వెడల్పు కావడంతో మండల పరిధిలోని లాలాపురం, తీగలబంజర గ్రామాల సమీపంలో రహదారుల పక్కన భూములు కొనుగోలు చేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నిర్మించడంతో ఫ్యాక్టరీలలో పార్కింగ్ సౌకర్యం యాజమాన్యాలు కల్పించకపోవడంతో ప్యాక్టరీలకు లోడ్‌తో వచ్చే లారీలు ఆన్లోడ్ అయ్యేవరకు రహదారులకు ఇరువైపులా నిలపివేయడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ విధంగా లారీలు రహదారికి ఇరువైపులా నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాత్రి సమయంలో ప్రయాణం భయంతో చేయాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై లారీలు అపకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.