Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న కష్టకాలంలో మాస్కులు ధరించకుండా సామాజిక దూరం పాటించకుండా మండల వ్యవసాయ అధికా రులకు నుండి ఎటువంటి అనుమతులు పొంద కుండా విత్తనాల కంపెనీ వారు అవగాహన పేరుతో అమ్మకాల కోసం ఎలా ప్రచారం నిర్వహిస్తారో తెలపాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మండలం పరిధిలోని కండ్రిక గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలో ఆంధ్ర రాష్ట్రం కృష్ణ జిల్లాకు సంబంధించిన నూజివీడు సీడ్స్ లిమిటెడ్ కంపెనీ వారు విన్నర్ అనే కొత్త రకం మొక్కజొన్న విత్తనాలు బాగా దిగుబడి వస్తుందనే ప్రచారం నిమిత్తం ఒక రైతు పంట పొలంలో అధిక దిగుబడితో బాగా పండిందనే బూచిగా చూపించి అమ్మకాల కోసం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మండల అధికారుల అనుమతులు పొందకుండా ఇటువంటి ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారో తెలపాలని రైతులు విత్తనాల కంపెనీకి సంబంధించిన మేనేజర్ని రైతులు ప్రశ్నిస్తు న్నారు.
కొత్త రకం విత్తనాలు బాగా దిగుబడి ఇస్తుందని చెప్పి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే రైతులు నష్టపోతే ఎవరు భరోసా ఇస్తారో తెలపాలని రైతులు కంపెనీని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర కంపెనీ విత్తనాల అమ్మకాలు ఏమిటా అని రైతులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపుతామని చెబుతున్నా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కొన్ని విత్తనాల కంపెనీలు కావాలనే దళారులను ఇక్కడ ఉపయోగించుకొని మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొంతమంది విత్తనాల డీలర్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వనీయ సమాచారం. ఆంధ్రా నుంచి కరోనా వైరస్‌ని తీసుకొచ్చి తెలంగాణలో రైతులకు అంటి స్తారా అని వారు ప్రశ్నించారు. జరిగిన ఈ కార్యక్రమం వలన రైతులకు ఉపయోగం ఏమీ లేదని రైతులు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పాల్గొనటం విడ్డూరంగా ఉందని కూడా చర్చ జరుగుతుంది. కరోనా నిబంధనలు పాటించకుండా మండల అధికారుల అనుమతి పొందకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నూజివీడు సీడ్స్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన అధికారులపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తమ నుండి విత్తనాల కంపెనీ వారు ఎటువంటి అనుమతులు పొందలేదని, తాను ఎన్నికల విధుల్లో ఉన్నానని మండల వ్యవసాయ అధికారి విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు.