Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
గ్రామాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని డిఆర్డిఏపిడి విద్యాచందన పేర్కొన్నారు. మండలంలోని తీగలబంజర, మేకలకుంట, గుండ్రాతి మడుగు గ్రామాలను శుక్రవారం పరిశీలిం చారు. ఈసందర్భంగా ఉపాధికూలీలు తక్కువగా వచ్చే తీగలబంజర, మేకలకుంట గ్రామపంచాయతీ లలో గ్రామస్తులను ఉపాధి కూలి పనులకు ఎందుకు రావడం లేదని అడిగి తెలుసుకున్నారు. వచ్చేవారం నుంచి ఉపాధి పనులకు రావాలని సూచించారు. అదేవిధంగా గుండ్రాతి మడుగు గ్రామంలో పని జరుగుతున్న దగ్గరకు వెళ్లి ఉపాధి కూలీలతో మాట్లాడుతూ ఎక్కువసేపు పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయన్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలను ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపిడివో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి కూలీల పెంపుదల, ఇజిఎస్ పనులపై రివ్యూ కార్యదర్శలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్పీవో, ఏపివో ఇసి, టిఏ లతోపాటు పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.