Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాధపాలెం
రైతు ఉత్పత్తిదారుల సంఘాలకే భవిష్యత్తు అని ఉద్యాన శాఖ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ బాబు స్పష్టం చేశారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఇల్లందు క్రాస్ రోడ్‌లోని (టిటిడిసి) సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, మరియు జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.అనసూయ, ఏపీ మహిళా అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, కంపెనీ సెక్రటరీ చరణ్‌లు సమావేశంలో పాల్గొని వివిధ మండల రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జి.అనసూయ మాట్లాడుతూ... మామిడి మిరప రైతులకు ఎఫ్‌బిఓ ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని ఆమె అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఏప్పిఓలకు విత్తనాలు, ఎరువులు, వంటి వాటిని సంఘాల ద్వారా అమ్మటానికి కావలసిన పర్మిషన్లు ఇస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు సందీప్ కుమార్, జి.నగెష్, వేణు, మీనాక్షి, కార్యాలయ సిబ్బంది, రచన వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.