Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విస్తృతంగా పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మొత్తం 40 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. మండలంలోని కప్పలబందం, బత్తులపల్లి, ఎర్రబంజర, నారాయణపురం, కొర్లగూడెం, పెరువంచ, ముగ్గువెంకటాపురం, రఘునాధగుడెం, చంద్రుపట్ల, వాచ్యానాయక్ తండా, కల్లూరు గ్రామ పంచాయతీల పరిధిలో అందజేశారు. పెరువంచ, వాచ్యనాయక్ తండాలలో తడి,పొడి చెత్త బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, రైతు సమితి మండల కన్వీనర్ డా,, లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ అత్తూనూరి రంగారెడ్డి, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, ఎఎంసి డైరెక్టర్ కట్టా ఆర్లప్ప, ఉబ్బన వెంకటరత్నం, కిరణ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు నందిగం ప్రసాద్, శీలం సత్యనారాయణ రెడ్డి, కొర్రా రుక్మిణి, నరసింహరావు, అంకిరెడ్డి అనూష రెడ్డి, వెంకటరెడ్డి, గొల్లమందల ప్రసాద్, కువ్వారపు విజయరావు, కుక్కా అంజారావు, కుక్కా నాగమ్మ, కావటి నర్సయ్య, జక్కంపూడి కిషోర్, వల్లభనేని భాస్కరరావు, రవి, శ్రీనివాసరావు, బొక్కా వెంకటేశ్వర్లు, బాణోత్ రాందాస్, బాణోత్ ఝాన్సీ, చల్లగుండ్ల వెంకటేశ్వరరావు, బండి వెంకటి, బాణోత్ బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.