Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత వాహనంలో ఆస్పత్రికి బాధితుల తరలింపు
- మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయప్రతినిధి
మనిషి తత్వం, మానవత్వం కొరవడిన ఈ రోజుల్లో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నేనున్నాం టూ రోడ్డు ప్రమాద బాధితులకు అభయం, సంపూర్ణ భరోసా ఇచ్చి, వారికి అండగా నిలబడి ఆపదలో ఆదుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొణిజర్ల వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటన ఖమ్మం ఎంపీ నామను హృదయాంతరాలను కదలించింది. ఈఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి మృతజీవిగా మారి, రోడ్డు మీద పడిపోయారు. మహిళ, ఇద్దరు పిల్లలూ శారీరమంతా తీవ్ర గాయాలతో రోడ్డుపైన దిక్కులేని వాళ్లలా పడి పోయారు. అటుగా వెళ్తున్న ఎంపీ నామ ఈ హృదయ విదారక దృశ్యాల దుర్ఘటనను చూసి చలించిపో యారు. ఎంపీ నామ తక్షణమే సంఘటన గురించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు క్షతగాత్రులను తన సొంత వాహనంలో మెరుగైన చికిత్స కోసం ఆగమేఘాల మీద ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లును ఫోన్లో కోరారు.
మాజీ మంత్రి చందులాల్ మృతికి ఎంపీ నామ సంతాపం
మాజీ మంత్రి , తెరాస నేత, అజ్మీరా చందులాల్ మృతికి టిఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తన ప్రగాఢ సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎంపీగా ఆయన సేవలు మరువలేనివ న్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు.