Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలి,
- ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించిన అఖిల పార్టీ నేతలు
నవ తెలంగాణ- రఘునాధపాలెం
చిమ్మపుడి గ్రామంలో చింతచెట్లను అకారణంగా నరికిన వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డివైయఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, కాంగ్రెస్ కిసాన్ రైతు జిల్లా అధ్యక్షులు నర్సిరెడ్డి, సీపీఐ మండల నాయకులు పొద్దుటూరి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిమ్మపుడి గ్రామంలో నరికేసిన చింతచెట్లను ఘటన స్థలానికి వచ్చి జిల్లా ఫారెస్ట్ రెవిన్యూ ఆఫీసర్ రాధిక, మండల ఆర్ఐ శ్రావణ్ విచారణ నిర్వహించారు.అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రవి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకృతి వనాలలో, నర్సరీలలో మొక్కలు పెంచుతుంటే మరోవైపు అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకులు ఏళ్ల సంవత్సరాల నుండి గ్రామానికి, వ్యవసాయ పనులకు, మూగజీవులకు ఆదురువుగా ఉన్న సుమారు 130 చెట్లను ఆ స్థలం యజమానులకు కూడా తెలియకుండా కొట్టివేసి, జేసీబీతో తొలగించి ఆనమళ్ళు లేకుండా చేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు యలమరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జోనెబోయిన పాపయ్య, కొటేరు శేషిదర్ రెడ్డి, భాగం, గురవయ్య, గుండ్ల గోవర్ధన్, కొటేరు మనోహర్ రెడ్డి, గొడుగు సంగయ్య, సీపీఐ నాయకులు పావురాల రాములు, గాడిచర్ల నాగేశ్వరరావు, వల్లపిన్ని, రంగయ్య, డివైయఫ్ఐ నాయకులు దశరద, వీరబాబు, జోనేబోయిన.నవీన్ తదితరులు పాల్గొన్నారు.