Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
ఏన్కూర్ మండల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లచ్చగూడెం గ్రామానికి చెందిన నల్లమల వెంకటేశ్వరావు గురువారం రాత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా శాసన సభ్యులు శ్రీ రాములు నాయక్‌లు విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం నల్లమల ఇంటి వద్ద ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ''మంచి స్నేహితుడిని కోల్పోయానని'' పొంగులేటి భావోద్వేగానికి లోనయ్యారు. పొంగులేటి వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్, భుక్యా లాలు, ఏన్కూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బానోత్ సురేష్ నాయక్, కొణిజర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకట రెడ్డిగారు, మేడా ధర్మారావు, చందమామ నర్సింహారావు, పూర్ణకంటి మైసారావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, చందులాల్, రామారావు, ఇస్నేపల్లి నాగేశ్వరరావు, శేభన్ నాయక్, రమేష్ తదితరులు ఉన్నారు.
గోపాలకృష్ణ కుటుంబానికి పొంగులేటి పరామర్శ
కొణిజర్ల మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మామ వంకిన గోపాలకష్ణ రావు ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఆకాలమరణం పొందారు. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం సింగరాయపాలెంలోని వారి నివాసం వద్ద వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రమ్మయ్య, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, ఎంపీపీ గోసు మధు, రైతు బంధు మండల కన్వీనర్ దొడ్డపునేని రామారావు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు