Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో ఈనెల 16 నుండి 25 వరకు
నవతెలంగాణ - ఖమ్మం
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఖమ్మం షోరూంలో వెండి ఆభరణాల ప్రదర్శనలో భాగంగా వెండి ఆభరణాలు, వెండి వస్తువుల ప్రదర్శన ఉంటుందని సంస్థ స్టోర్ హెడ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనలో భాగంగా ప్రతి రూ. 5వేల వెండి ఆభరణాల కొనుగోలుపై రూ.500 ప్రత్యేక తగ్గింపు, వెండి వస్తువులపై ప్రత్యేకమైన ఆఫర్లను పొందవచ్చని, ఈ ప్రదర్శన కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఖమ్మం షోరూంలో ఈనెల 16 నుండి 25 వరుకు నిర్వహించబడుతుందని, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ''వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్' అనే ప్రచారం ప్రారంభించిందని, ఇందులో భాగంగా భారత దేశ వ్యాప్తంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అన్ని షోరూములలో ఒకే ఉత్తమమైన ధర వినియోగదారులకి అందించడం జరుగుతుంది అని తెలిపారు. అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యూవెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్‌కి సంభందించిన మూల్యమైన సంస్థ అని, ఈ సంస్థ తమ వార్షిక ఆదాయంలో నుంచి గణనీయమైన వాటాని సామాజిక సంస్థాగత బాధ్యత రూపంలో ఆరోగ్యం, ఉచిత విద్య, నిరుపేదలకు గృహ నిర్మాణం, మహిళా సాధికారత ఇంకా పర్యావరణ రక్షణ విభాగాలలో తమవంతు సాయం అందిస్తుందని తెలిపారు. మలబార్ 'గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాల విక్రయ వ్యాపారంలో ఒక ప్రత్యేకత ఏర్పరుచుకుంటూ ఇండియా, సింగపూర్, జీసిసి దేశాలలో 260 షోరూంలతో విస్తరించుకొని ముందుకు సాగుతుందన్నారు.