Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి
- వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి
నవతెలంగాణ- సత్తుపల్లి
ఉపాధి కూలీలకు రోజువారీ రూ. 600 చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గంగారంలో శనివారం ఉపాధి కూలీలతో సమావేశమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి పనుల ప్రదేశాల వద్ద సౌకర్యాలను కల్పించాలన్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు టెంటు, మెడికల్ కిట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపధ్యంలో వారికి ఇప్పుడిస్తున్న కూలి డబ్బులు ఏ మాత్రం సరిపోయే పరిస్థితి లేదన్నారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో మాస్కులు, శానిటైజర్లు సరఫరా చేయాలన్నారు. కొత్తగా ఉపాధి పనుల్లో చేరిన కూలీలకు గడ్డపారలు ఇవ్వలేదన్నారు. పేస్లిప్పులు ఇవ్వడం లేదన్నారు. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కూలీలను ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, మహేశ్, సోయం రాజారావు, కమలమ్మ, రాణి, జ్యోతి, ఏసయ్య పాల్గొన్నారు.