Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను శుక్రవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. తొలుత మండలంలోని ముజ్జుగూడెం గ్రామంలో ఉండేమోదుగుల శ్రీనివాసరావు కుమారుడి అన్నప్రాసన కార్యక్రమానికి హాజరై చిరంజీవిని ఆశీర్వదించారు. అనంతరం రాజేశ్వరపురం గ్రామంలో పార్టీ కార్యకర్త బాలాజీ మాతృమూర్తి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. చెరువుమాదారం గ్రామంలోని ఎడవల్లి చంద్రయ్య సతీమణి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. కొత్తూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పునుగుండ్ల రంగయ్య మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తిరుగు ప్రయాణంలో ఆచర్లగూడెం క్రాస్ రోడ్లో రైతులంతా తమ ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోస్తుస్తుండగా కారు దిగి వారితో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సాదు రమేష్ రెడ్డి, శాఖమూరి రమేష్, వెన్నపూస సీతారాములు, తమ్మినేని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.