Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సానుభూతిపరుడు గంగాధరణి రామకోటయ్య(90) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. రామకోటయ్య ఇల్లు ఉద్యమ కేంద్రంగా ఉండేది. ఏలూరి లక్ష్మినారాయణ సారధ్యంలో విశ్వనాధపల్లిలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, కూలీ, పాలేరుల పోరాటాల్లో రామకోటయ్య కుటుంబం ముందుండి పోరాడింది. రామకోటయ్య భార్య సావిత్రమ్మ ఐద్వాలో చురుకైన కార్యకర్తగా ఉంటూ అనేక పోరాటాల్లో పాలుపంచుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సీపీఐ(ఎం)మహాసభ జరిగినా కుటుంబ సభ్యులు సద్దులతో హాజరై తమ అభిమానాన్ని చాటుకునేవారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు, చిన్నకుమారుడు మృతి చెందగా పెద్దకుమారుడు గంగాధరణి నాగేశ్వరరావు సీపీఐ(ఎం) కార్యకర్తగా ఉన్నారు. రామకోటయ్య భౌతికకాయాన్ని ఎంపీటీసీ వడ్డె అజరుబాబు, సర్పంచ్ హలావత్ ఇందిరాజ్యోతి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు రేగళ్ళ మంగయ్య, షేక్ సైదులు, వల్లభినేని మురళి, తమ్మినేని ముత్తయ్య, ఇమ్మడి నర్సయ్య పాల్గొన్నారు.