Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న బంద్ విజయవంతం చేయాలని పిలుపు
నవతెలంగాణ-చర్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడి దారుల ఆదేశానుసారం జల్, జంగల్, జమీన్ ఖనిజ సంపదను దోసుకోవడానికి అడ్డుగా వున్న మావోయిస్టు పార్టీని అణచివేయడానికి సమాధాన్ దాడిలో భాగంగానే ప్రహార్ సైనిక దాడిని 2019 డిసెంబర్ నుండి ప్రభుత్వాలు మొదలు పెట్టాయని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ పత్రికా ప్రకటనలో తెలిపారు . శుక్రవారం పాత్రికే యు లకు అందిన పత్రికా ప్రకటనలో ముఖ్యంగా 2020 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఈ దాడిలో దేశ వ్యాప్తంగా 300 లకు పైగా ప్రజలను , పీఎల్ జీఏ సభ్యులను కమాండర్స్ , వివిధ స్థాయిలలోని నాయ కత్వ కామ్రేడ్స్‌ను బూటకపు ఎన్కౌంటర్లు, ఎన్ కౌంటర్లలో, చిత్రహింసలు, విషప్రయోగాల ద్వారా పోలీసు బలగాలు హత్యలు చేశాయని పేర్కొన్నారు. దండకారణ్యంలో 150 మందికి పైగా మావో యిస్టు లను హత్య చేశారని, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభు త్వం 10 మంది విప్లవకారులను పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారని, విషప్ర యోగం వల్ల పదుల సంఖ్యలో దళం కామ్రేడ్స్ అనారో గ్యానికి గురైనారని, కామ్రేడ్ విజేందర్ విష ఆహారాన్ని తిని అమరుడైనాడు. వందలాది మందిని చిత్రహి ంసలకు గురి చేస్తూ జైళ్ళలో బంధిస్తున్నారని పేర్కొ న్నారు. ప్రహార్ సైనికదాడులకు నిరసనగా 26న జరిగే భారత్ బంద్‌లో భాగంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.