Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తం అయిన అశ్వారావుపేట ప్రజానీకం
- ఎంపీపీ నేతృత్వంలో ఎమ్మెల్యేకు వినతి
- అశ్వారావుపేటలో ఏర్పాటుకు ఆదేశం
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఇటీవల టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న టీడీపీ శ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గురువారం మంత్రి పువ్వాడ అజరును మొదటి సారిగా ఖమ్మంలో మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు అశ్వారావుపేట ప్రాంతం అపరిస్రృత సమస్యలపై వినతి పత్రం అందజేసారు. ఇందులో దీర్గకాలంగా ఉన్న ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు ఒకటి. దీంతో స్పందించిన మంత్రి అజరు ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా వెంటనే ఆర్టీఓ జిల్లా స్థాయి అధికారులకు హుకుం జారీ చేసారు. ఈ ఆదేశాలను అందుకున్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఆర్టీఓ అధికారులు వేణు, కిషన్ రావు, శ్రీనివాస్‌లు శుక్రవారం దమ్మపేట మండలం, తాటి సుబ్బన్న గూడెంలో గల ఎమ్మెల్యే స్వగృహంలో మార్యాదపూర్వకంగా కలవడంతో పాటు ఆర్టీఓ తాత్కాలిక కార్యాలయంపై చర్చించి, ఇదే మండలంలోని మందలపల్లిలో ఏర్పాటుకు స్థలం పరిశీలించారు.
ఈ విషయం కాస్తా సామాజిక మాధ్యమం ద్వారా తెలుసుకున్న అశ్వారావుపేట ప్రజానీకం అప్రమత్తం అయ్యారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో నిర్వహించాల్సిన కార్యాలయం మందలపల్లిలో పెట్టడానికి అంగీకరించమంటూ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి పుల్లారావుతో సహా పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి నేతృత్వంలో అశ్వారావుపేట నుండి సమూహంగా వెళ్ళి తన స్వగృహంలో ఉన్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని కలిసి అశ్వారావుపేటలో కార్యాలయం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసారు. దీంతో మెచ్చా నాగేశ్వరరావు ఆర్టీఓ అధికారులకు ఫోన్ చేసి అశ్వారావుపేటలోనే కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.