Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాణంతో ఒకరి హత్య, రెండు వాహనాలు దహనం
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు మళ్లీ భీభత్సం సృష్టించారు. స్థానికుల ద్వారా అందిన సమాచారం ప్రకారం గోర్గుండ-తోనార్ మధ్యలో నిర్మాణంలో ఉన్న రహదారి నిర్మాణ పనులను ఆపేందుకు ఆయుధాలు, విల్లంబులతో వచ్చిన మావోయిస్టులు రెండు వాహనాలకు నిప్పంటించి తగులబెట్టారు. ఈ ఘటనలో ఒక టిప్పర్, ట్రాక్టర్ కాలిపోయాయి. వాహనాలు తగులబెడుతుండగా అడ్డుపడిన సిబ్బందిని కర్రలతో చితకబాది హల్ చల్ సృష్టించారు. బాణంతో ఒకరిని హత్య చేశారు. మరో ఇద్దరిని తమ వెంట బందీగా తీసుకెళ్ళినట్టు సమాచారం. ఈ ఘటన పోలంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.